నందిని దెందుకూరి (శిరీషా గారి సహాయం తో)

 • ప్రతి రోజూ జీవించి ఉన్నందుకు ఆనందించు
 • నీకు దక్కిన ఆశీర్వాదాలకు తృప్తీ చెందు
 • ప్రతి సమస్యకు పరిష్కారము ఉంటుందని నమ్ము
 • అనిశ్చితం వలన కలవర పడకు
 • ఆశా ప్రవాహము పరిష్కారము వైపు దారి చూపిస్తుంది
 • సరైన దృష్టి ఉన్నప్పుడు కష్టమైన పరిస్థితి లో కూడా ఒక అనుకూలమైన మార్గము కనిపిస్తుంది
 • నీ పరిస్థితి ని ఎప్పుడు అంగీకరించు. విముఖతను సుముఖతతో భర్తీ చెయ్యి
 • ఎలా ఉన్నప్పటికైనా ప్రతి మనిషిని సహానుభూతి తో ఆదరించు అభిమానించు
 • పరులయందు కరుణ మరియు ఉదారము చూపించు
 • ప్రతికూలమైన ఆలోచనలు నిజమైనవి కావు. అవి మన తరచుగా మన అధీనంలో లేని విషయాలు
 • మనము గతము గురించి చింతిస్తూ, భవిష్యత్తు గురించి ఆరాట పడుతూ ఉంటాము
 • ప్రతికూలమైన ఆలోచనలు కేవలం భయం వలన కలుగుతాయని అర్థం చేసుకో
 • భయం అగ్న్యానం వలన ఏర్పడుతుంది.
 • కొత్త ప్రయోగాలను చేస్తునప్పుడు అగ్న్యానాన్ని ఎదుర్కోవడం మామూలే. అటువంటి ప్రయోగాలు పరిణామక్రమానికి అవసరము
 • ఆనందమన్నది నీ పరిస్థితి లో ఉండదు, అది నీలో ఉంటుంది!